Caste Politics Comment : గెలుపు మంత్రం కులాలే కీలకం
తెలంగాణ ఎన్నికల్లో విక్తరీ ఎవరిదో
Caste Politics Comment : అటు ఏపీలో ఇటు తెలంగాణలో కులాలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రతి పార్టీ కులాల జపం చేస్తున్నాయి. ఏపీలో కమ్మ, కాపు , రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో(Telangana) ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలు బయటకు చెప్పక పోయినా ప్రతి పార్టీ చివరకు వామపక్షాలు సైతం కులాల వారీగా చీలి పోయారు. ఆయా పార్టీల నాయకత్వం కూడా కులాల ప్రాతిపదికనే ఉంటున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. విచిత్రం ఏమిటంటే రెండు రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉన్న కులాలకు రాజ్యాధికారంలో చోటు కల్పించడం లేదు. దక్కడం లేదని చెప్పక తప్పదు. మా కోటా మా వాటా అన్నది ప్రధాన నినాదంగా మారింది. దీనినే ఆధారంగా చేసుకుని కులాలు సమీకరణలు చేస్తున్నాయి. తమ గొంతును వినిపిస్తున్నాయి. ఏపీలో మాలలు, తెలంగాణలో మాదిగలు అత్యధికంగా ప్రభావితం చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా తమ సామాజిక వర్గానికి ఏబీసీడీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ వస్తున్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మంద కృష్ణ మాదిగ.
Caste Politics Comment Viral
ఆయన బేషరతుగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గారు. విశ్వ రూప సభను ఏర్పాటు చేసి మోదీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. నక్సలైట్ ఉద్యమ భావజాలం నుంచి వచ్చిన మంద కృష్ణ మాదిగ ఉన్నట్టుండి కమలం గూటికి చేరడాన్ని వామపక్ష వాదులు, నక్సలైట్లు , మేధావులు జీర్ణించు కోవడం లేదు. ఇది పక్కన పెడితే ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడతో ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చింది. తెలంగాణలో(Telangana) అత్యధిక జనాభా వాటా కలిగిన బహుజనుల (బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు) ను టార్గెట్ చేసింది. ఈ మేరకు అందరి తరపున ఒకే నినాదంతో ముందుకు వచ్చింది . తమ పార్టీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు పీఎం మోదీ. ఇంకా ఫలితాలు రాలేనే లేదు ఈటల రాజేందర్ , బండి సంజయ్ మధ్య పోటీ నెలకొంది. ఇది పక్కన పెడితే ఇంత కాలం తెలంగాణను(Telangana) పాలించిన వారిలో అత్యధిక శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే సీఎంగా ఉన్నారు.
తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ప్రస్తుతం ఆయనను అడ్డం పెట్టుకుని సదరు సామాజిక వర్గం అన్ని రంగాలలో విస్తరించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వెలమ సామాజిక వర్గానికి ధీటుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు అన్ని పార్టీలలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇక ముదిరాజ్ , ఇతర కులాలు ఉన్నప్పటికీ ఏ మేరకు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముదిరాజ్ లకు టికెట్ కేటాయించ లేదు.
ఇక కాంగ్రెస్ బీసీలను పట్టించు కోలేదు. బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటేనన్న అపవాదుకు తగ్గట్టుగానే సీనియర్లు తప్పుకుని ఇతరులకు సీట్లు కట్టబెట్టారు. బీజేపీ పూర్తిగా మతం ప్రాతిపదికన హిందూ ఓటు బ్యాంక్ తమకు వస్తుందని భావిస్తోంది. ఇక మరో కీలకమైన సామాజిక వర్గం ముస్లింలు, క్రిష్టియన్లు. ఈసారి గంప గుత్తగా కాంగ్రెస్ వైపు వెళతారనే ప్రచారం జోరందుకుంది. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని, అన్ని వర్గాలకు అందించామని తమ గెలుపు పక్కా అని ధీమాతో ఉన్న బీఆర్ఎస్ భావిస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఇక తాము నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం చెబుతున్నాయి. ఏది ఏమైనా బహుజనులు కలీకంగా ఉన్న కులాలే కీలకం కానున్నాయన్నది వాస్తవం.
Also Read : Minister KTR : మాకే అధికారం మాదే రాజ్యం