Chitra Ramakrishna : హిమాలయ యోగితో సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎన్ఎస్ఈ చీఫ్ చిత్ర రామకృష్ణను(Chitra Ramakrishna )ఇవాళ సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం.
హిమాలయాల్లో నివిసిస్తున్న ఆధ్యాత్మిక గురువుతో ఆర్థిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపణలు రావడంతో అప్రమత్తమైంది దర్యాప్తు సంస్థ.
టిక్ బై టిక్ మార్కెట్ తారు మారు కేసులో దేశంలోని అతి పెద్ద స్టాక్ ఎక్ఛేంజీ కి మాజీ చీఫ్ గా పని చేశారు చిత్రా రామకృష్ణ. ఆమెను ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారిస్తున్నట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసుకు సంబంధించి ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి సరికొత్తగా వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో వాటి ఆధారంగా చిత్రా రామకృష్ణను(Chitra Ramakrishna )ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా చిత్రా రామకృష్ణతో పాటు ఆనంద్ సుబ్రమణ్యం, రవి నారాయణ్ లను కూడా దేశం విడిచి వెళ్ల కూడదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు కూడా జారీ చేసింది.
2013 నుంచి 2016 దాకా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు చిత్రా రామకృష్ణ. వ్యక్తిగత కారణాలతో వైదొలిగే కంటే ముందు యోగితో గోప్యమైన ఆర్థిక డేటాను పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
సదరు యోగి గురు హిమాలయాల్లో ఉన్నారు. 2010 నుంచి 2014 దాకా స్టాక్ ఎక్స్చేంజ్ సర్వర్ ల నుంచి బ్రోకర్లకు టిక్ బై టిక్ ఆధారిత సిస్టమ్ ఆర్కిటెక్చర్ ద్వారా సమాచారం వరుస పద్దతిలో పంపించారని అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
Also Read : ఐటీ పార్కుతో 50 వేల జాబ్స్