Vice Presidential Election 2025: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సీఈసీ కసరత్తు
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సీఈసీ కసరత్తు
Vice Presidential Election : ఉప రాష్ట్రపతి పదవికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మాతుగా రాజీనామా చేశారు. దీనితో ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice Presidential Election) అనివార్యమైంది. అయితే ఆ పదవిని చేపట్టేదెవరనే ఓ చర్చ అయితే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్రకటించింది. ఈ మేరకు సీఈసీ ట్వీట్ చేసింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం… లోక్‌సభ సభ్యులతోపాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్లస్ నామినేటెడ్ సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారని వివరించింది.
Vice Presidential Election 2025 Updates
మరోవైపు ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని… మరో ఇద్దరు ఉన్నతాధికారులను అదనపు రిటర్నింగ్ అధికారులుగా సీఈసీ నియమించింది. ఉప రాష్ట్రపతి 2025 ఎన్నిక కోసం సంబంధించి ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు చెప్పింది. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని విశదీకరించింది.
ఇక ఈ పదవి బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ లేదా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసే అవకాశముందని ఓ ప్రచారం సైతం సాగుతోంది. కానీ సీపీ రాధాకృష్ణన్‌కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. దీనితో అతడి వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్రంలోని బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Also Read : YS Jagan: రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు – వైఎస్ జగన్
