Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి – కేంద్ర మంత్రి పెమ్మసాని

2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి - కేంద్ర మంత్రి పెమ్మసాని

Pemmasani : దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గత ప్రభుత్వ తీరు వల్లే ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రం వెనకబడిందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర నిధులను వినియోగించుకుంటే ఇప్పటికే 5, 6 లక్షల ఇళ్లు కట్టించి ఉండొచ్చన్నారు. ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. నరేగా నిధుల వినియోగంలోనూ గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకొని జల్‌జీవన్‌ మిషన్‌ పూర్తి చేసుకోవాల్సిన అవసరముందని పెమ్మసాని(Pemmasani Chandrasekhar) అన్నారు.

Pemmasani Chandrasekhar Comment

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ళ పట్టాలను మంజూరు చేస్తూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద నిధులు మంజూరు చేస్తూ ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. కేవలం కేంద్రం నిధులను మాత్రమే లబ్దిదారులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ వంతు నిధులను అందించలేదు. దీనితో కనీసం ఇరవై శాతం ఇళ్ళను కూడా గత ఐదేళ్ళలో పూర్తి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఇళ్ళ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర నిధులను పెంచడంతో పాటు రాష్ట్రం తన వాటాగా కొంత నిధులను కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇస్తున్నట్లు ప్రకటించింది.

Also Read : Punjab CM Bhagwant Mann:  పారిస్‌ ఒలింపిక్స్‌ కు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ !

Leave A Reply

Your Email Id will not be published!