Centre Shock : ఐఏఎస్..ఐపీఎస్ లకు కేంద్రం షాక్
ప్రైవేట్ అవార్డులు తీసుకోవద్దు
Centre Shock : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులు ఎలాంటివి స్వీకరించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం గమనార్హం.
ప్రైవేట్ సంస్థలు ఏవైనా సరే ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నా తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అసాధారణ పరిస్థితుల్లో పురస్కారాలను తీసుకునేందుకు గాను సంబంధిత శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
అంతే కాకుండా అవార్డులకు సంబంధించి నగదు పురస్కారం ఉండకూడదని పేర్కొంది. అవార్డులు ప్రదానం చేసే సంస్థలు, వ్యక్తులు, కంపెనీలు, స్వచ్చంధ సంస్థలకు క్లీన్ చిట్ ఉండాలని కుండ బద్దలు కొట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు(IAS, IPS), ఉన్నత స్థానాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, పురస్కారాలను అందుకుంటున్నారు. దీని వల్ల సదరు సంస్థలు వీటిని అడ్డం పెట్టుకుని లబ్ది పొందుతున్నాయని కేంద్రం పేర్కొంది. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read : Bhatti Vikramarka : దొర పాలనలో రాష్ట్రం ఆగమాగం