Centre Bans 14 Apps : 14 టెర్రర్ గ్రూప్ యాప్ లపై నిషేధం
వేటు వేసిన మోదీ కేంద్ర ప్రభుత్వం
Centre Bans 14 Apps : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్ను దన్నుగా ఉంటూ వస్తున్న మబైల్ మెసెంజర్ యాప్ లపై(Centre Bans 14 Apps) ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ఉగ్రవాద గ్రూప్ లపై భారీ అణచివేతలో భాగంగా 14 మొబైల్ మెసెంజర్ యాపల్ ను నిషేధం విధించింది.
ఈ యాప్ లు జమ్మూ కాశ్మీర్ లోయలో తీవ్రవాద ప్రచారం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది కేంద్రం.
వీటిని వెంటనే బ్లాక్ చేయడం జరిగిందని తెలిపింది. దాయాది పాకిస్తాన్ నుండి సూచనలను స్వీకరించేందుకు ఈ టెర్రర్ గ్రూప్ యాప్ లు అత్యంత కీలకంగా మారాయని , ఇవి నిషిద్ధ తీవ్రవాద గ్రూపులకు ఉపయోగ పడేందుకు వీలుగా తయారు చేశారని వెల్లడించింది. ఓవర్ గ్రౌండ్ వర్కర్లతో కమ్యూనికేట్ చేసేందుకు, సూచనలు స్వీకరించేందుకు జమ్మూ, కాశ్మీర్ లోని ఉగ్రవాద గ్రూపులు ఎక్కువగా ఈ 14 యాప్ లను(Centre Bans 14 Apps) ఉపయోగిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది కేంద్ర సర్కార్.
ఈ నిషేధిత యాప్ లో క్రిప్ వైజర్ , ఎనిగ్మా, సేఫ్స్ విష్ , విక్రమీ, మీడియాఫైర్ , బ్రియార్ , బిచాట్ ,నంద్ బాక్స్ , కాన్వియన్ , ఐఎంఓ, ఎలిమెంట్ , సెకండ్ లైన్ , జంగి, త్రీమా యాప్స్ ఉన్నాయి. వీటిపై పూర్తిగా నిషేధం విధించినట్లు మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : మన్ కీ బాత్ కి బిల్ గేట్స్ ఫిదా