Chalo Jeete Hain: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ‘‘ఛలో జీతే హై’’ సినిమా

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ‘‘ఛలో జీతే హై’’ సినిమా

Chalo Jeete Hain : ప్రధాని నరేంద్రమోదీకి నేటితో 75 ఏళ్లు నిండిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) ప్రత్యేకంగా సేవా పక్వాడ పేరుతో దేశవ్యాప్తంగా 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకూ సేవాకార్యక్రమాలు నిర్వహించనుంది. మరో అడుగు ముందుకేసి బిహార్ బీజేపీ యూనిట్ మోదీ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరుపుకోనుంది. ప్రధానమంత్రి బాల్యం నేపథ్యంలో రూపొందిన ‘చలో జీతే హై’  (Chalo Jeete Hain) చిత్రాన్ని రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజవర్గాల్లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసింది.

Chalo Jeete Hain Cinema

రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మోదీ సాధించిన విజయాలను ప్రదర్శించనుంది. ఇక ఈ ప్రదర్శనల కోసం 243 వాహనాలను బీజేపీ సిద్ధం చేసింది. వాటికి పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఉన్నాయి. మంగళవారం పట్నాలో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్‌ వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ‘‘ఇది కేవలం ఒక సినిమా కాదు. ఆయన చిన్ననాటి జీవితంలో చవిచూసిన వాస్తవాలు. ఆయన పేదరికాన్ని అనుభవించారు. తన తల్లిపడిన కష్టాలను దగ్గరి నుంచి చూశారు. అందుకే ఆయనకు పేదలు అనుభవించే బాధ తెలుసు’’ అని మంత్రి ఆ సందర్భంగా వెల్లడించారు.

ఈ ‘ఛలో జీతే హై’ సినిమాకు మంగేశ్‌ హడవాలే దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం 2018 జూలై 11న విడుదలైంది. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇతరుల కోసం జీవించేవారు మాత్రమే అసలైన జీవితం జీవిస్తారంటూ స్వామి వివేకానంద చెప్పిన సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఓ బాలుడి గురించి అందులో ప్రస్తావించారు. బెస్ట్ నాన్‌ ఫీచర్ ఫిల్మ్‌గా అది జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకోవడం విశేషం. ప్రధాని మోదీ చిన్ననాటి జీవితమే ఈ సినిమా కథకు ప్రేరణ. ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది.

Also Read : Deportation: 16వేల మంది విదేశీయుల బహిష్కరణకు కేంద్రం సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!