Chandra Babu Bail Comment : బాబూ కండీషన్స్ అప్లై
తీర్పు కాకుండానే సంబురాలా
Chandra Babu Bail Comment : ఏపీ స్కిల్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఊరట లభించింది. తనకు అనారోగ్యం ఉందని, కంటి శస్త్ర చికిత్స అవసరం ఉందంటూ , తనకు బెయిల్ కావాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తూ నాలుగు వారాల పాటు వెసులుబాటు ఇచ్చింది. రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాక టీడీపీ శ్రేణులు సంబురాలలో మునిగి పోయాయి. ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అదుపు తప్పితే ఎలా ఉంటుందో టీడీపీ చేస్తున్న హంగామాను చూస్తే అలా అనిపించక మానదు. గౌరవ న్యాయమూర్తి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కండీషన్స్ అప్లై అవుతాయంటూ హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఎలాంటి ప్రచార సభల్లో పాల్గొన కూడదు. ఎవరి పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు ఉండ కూడదు. అంతే కాదు మీడియాతో మాట్లాడకూడదంటూ స్పష్టం చేశారు జడ్జి.
Chandra Babu Bail Comment Viral
నిన్నటి దాకా అనారోగ్యం ఉందంటూ కారణం చూపి బెయిల్ సాధించుకున్న బాబు(Chandra Babu) బయటకు వచ్చాక చాలా ఉల్లాసంగా కనిపించారు. కోర్టు పరిధిలో కేసు ఉన్నప్పుడు ప్రధాన మంత్రి అయినా లేదా రాష్ట్ర పతి అయినా లేదా సీఎం, మాజీ సీఎంలు అయినా కట్టుబడి ఉండాల్సింది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకు(Chandra Babu) ఇవన్నీ తెలియదని అనుకోవడానికి వీలు లేదు. ప్రతి దానిని రాజకీయం చేయడంలో సిద్దహస్తుడన్న పేరుంది.
ఇప్పటికే వైసీపీ ఆరోపణలు చేసినట్టు వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో దిట్ట అన్న అపవాదు ఉంది. ఎన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేసినా చివరకు రిమాండ్ ఖైదీగా ఏకంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. భద్రతపై నానా యాగీ చేశారు. చివరకు ఖైదీల నుంచి ప్రాణ భయం ఉందంటూ ఓ లేఖ వదిలారు. ఇది తాను రాసింది కాదని ఎవరో బయటి నుంచి పంపించారంటూ సాక్షాత్తు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ ప్రకటించారు.
మరో వైపు తన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే మరోసారి నోరు జారారు. ఇక యుద్దమే మిగిలి ఉందన్నారు. ఎవరితో యుద్దం చేస్తారో చెప్పలేదు. ఇప్పటికే కోర్టు మెట్టికాయలు వేసింది. ఒక వర్గానికి చెందిన మీడియా అత్యుత్సాహం చూసి తట్టుకోలేక పోయింది. చివరకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గవర్నర్ సీరియస్ అయ్యారు. తీర్పు చెప్పిన న్యాయమూర్తులు, చెప్పేందుకు బెంచ్ మీదుకు వచ్చిన వారిపై కులాన్ని అంటగట్టడం, వారిని ట్రోల్ చేయడం , బహిరంగంగానే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇకనైనా అది టీడీపీ అయినా లేదా జనసేన అయినా లేదా వైసీపీ అయినా , బీజేపీ అయినా ..ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. లేక పోతే న్యాయం కొరఢా ఝులిపించాల్సి ఉంటుంది.
Also Read : Rahul Gandhi : ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న కేంద్రం