Chandra Babu Offer : జేడీకి బాబు బంప‌ర్ ఆఫ‌ర్

ల‌క్ష్మినారాయ‌ణ పార్టీకి ఛాన్స్

Chandra Babu : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు శ‌ర వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లోనే శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రిగేందుకు తేదీ ఖ‌రారు చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈసీ ప్ర‌త్యేక బృందం ప‌ర్య‌టించింది. ఎన్నిక‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించింది.

Chandra Babu Offer Viral

తాజాగా పొత్తులకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu). ఆయ‌న బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. ఇటీవ‌లే సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జై భారత్ నేష‌న‌ల్ పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పార్టీల మ‌ధ్య పోరు నెల‌కొనే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది.

గ‌తంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. ఆ త‌ర్వాత ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ , తెలుగుదేశం, జ‌న‌సేన , సీపీఐ, సీపీఎంతో పాటు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ కొత్త‌గా స్థాపించిన జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ ఉంది. ఇదిలా ఉండ‌గా టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ‌, శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీనారాయ‌ణ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఒక ఎంపీ స్థానంతో పాటు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బాబు చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది రాజ‌కీయ వ‌ర్గాల‌లో.

Also Read : Prashant kishor : ఉచితం అధికారానికి మార్గం

Leave A Reply

Your Email Id will not be published!