Chhatrapati Shivaji: మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం !

మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం !

Chhatrapati Shivaji: మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌ లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం(Chhatrapati Shivaji) సోమవారం కుప్పకూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. కాగా, తొమ్మిది నెలలు కూడా పూర్తికాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని దుయ్యబట్టాయి.

Chhatrapati Shivaji Statue..

అయితే విగ్రహం కూలడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. కానీ గత రెండుమూడు రోజులుగా సింధుదుర్గ్‌ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం కూలడానికి కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక విగ్రహం కూలిన అనంతరం సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రధాని ఆవిష్కరించిన శివాజీ విగ్రహం ఇలా ఉన్నట్టుండి కూలిపోవడంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్సీపీ (శరద్‌ పవార్‌) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంతి పాటిల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విగ్రహం కూలిపోయిందని.. నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేవలం కార్యక్రమం నిర్వహణపై మాత్రమే దృష్టి సారించిందని విమర్శించారు.

Also Read : Rajya Sabha By Pools : రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర మంత్రులు కురియన్, బిట్టు

Leave A Reply

Your Email Id will not be published!