Chandrababu: గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు !
గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు !
Chandrababu: ఉచిత ఇసుక విధానాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.
Chandrababu Comment for Sand
రీచ్‌కు దగ్గరగా స్టాక్ సాయింట్ ఉండాలని సూచించారు. రవాణా ఛార్జీలను నియంత్రించాలని అన్నారు. గ్రామ సచివాలయం కేంద్రంగా ఇసుక రవాణా సాగాలన్నారు. ఇసుక రవాణాకు ధరలు నిర్ధారించాలని తెలిపారు.
ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కేవలం ఇసుక తవ్వకం, రవాణాకే చార్జీలు వసూలు చేయాలని సూచించారు. రవాణా ఛార్జీలు పెరగకుండా అతి దగ్గరగా ఇసుక రీచ్ పెట్టాలని న్నారు. ఎప్పటికప్పుడు రవాణా ధర ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇసుక ధర కన్నా రవాణా ఛార్జే పెరిగిందని చెప్పారు. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే వారిని అక్కణ్నుంచి తప్పిస్తానని హెచ్చరించారు.
సచివాలయంలో ఇసుక(Sand) బుకింగ్ చేస్తే రవాణా ఛార్జీలే చెల్లించేలా ఉండాలని అన్నారు. ఇసుక(Sand) రీచ్ నుంచి ఇంటి వరకు తక్కువ ఛార్జీతో ఇసుక వచ్చేలా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించవద్దని అన్నారు. సహజ వనరుగా ఇసుకను ఇష్టానుసారంగా దోపిడీ చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు చెప్పినా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నంచేశారని అన్నారు. ఇసుక విషయంలో చాలా అక్రమాలు జరిగాయని అన్నారు. సీఐడీ విచారణ చేస్తున్నామని.. విచారణ చేసి నిందితులను శిక్షిస్తామని తెలిపారు.
భూగర్భ జలాలను పెంచుకునేలా మనం ప్రయత్నం చేయాలన్నారు. చెక్‌డ్యామ్‌లను మరమ్మతు చేయాలని భావిస్తున్నానని.. ముందుగా అన్ని రిజర్వాయర్లు, చెరువులను పూర్తిగా నింపాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువులను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గత ప్రభుత్వం గేట్ల మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన ఉండకూడదని సూచించారు.
అంతకుముందు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులు చూశామని చెప్పారు. చిన్న తప్పు జరిగితే సరిచేయొచ్చని సూచించారు. కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు. మన నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఉందని అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read : Tammineni Sitaram: 55 రోజుల్లో టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది !