CITI Bank Rejects Adani Group : అదానీ గ్రూప్ కు సిటీ గ్రూప్ షాక్
రుణాల నిలిపివేతకు ఆదేశం
CITI Bank Rejects Adani Group : అమెరికా దిగ్గజ సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో షేర్లు పతనం చెందుతూనే ఉన్నాయి. మరో వైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్ కు ప్రభుత్వ ,ప్రభుత్వేతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎన్ని కోట్ల రుణాలు ఇచ్చాయో వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో నీలి నీడలు కమ్ముకున్నాయి అదానీ గ్రూప్ పై. మరో వైపు పార్లమెంట్ లో అదానీ గ్రూప్ చేసిన మోసంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చశాయి. తాజాగా సిటీ గ్రూప్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. రుణాలు నిలిపి వేయాలని ఆదేశించింది.
మొన్న హిండెన్ బర్గ్ దెబ్బ కొడితే నిన్న క్రెడిట్ సూసీ షాక్ ఇచ్చింది…ఇవాళ సిటీ గ్రూప్ దిమ్మ తిరిగేలా ఝలక్ ఇచ్చింది అదానీ గ్రూప్ కు. ఇందులో భాగంగా అదానీ కంపెనీల సెక్యూరిటీలకు ఆమోదాన్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
మోసానికి పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. 36 పేజీల నివేదిక విడుదల చేసింది. గత కొంత కాలంగా లాభాల బాట పడుతూ దూసుకు పోయిన అదానీ గ్రూప్ ఉన్నట్టుండి భారీ ఎత్తున దెబ్బ పడింది. కొత్త రుణాలు పుట్టకుండా దారులన్నీ మూసుకు పోతున్నాయి. దీంతో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు గౌతమ్ అదానీ.
అమెరికాలోని దిగ్గజ బ్యాంకింగ్ గా పేరొందింది సిటీ గ్రూప్. మరో వైపు స్విట్జర్లాండ్ రెండో అతి పెద్ద బ్యాంక్ క్రెడిట్ సూసీ అదానీ గ్రూప్ బాండ్ల విలువ సున్నా అని ప్రకటించింది(CITI Bank Rejects Adani Group). దీంతో షేర్లు మరింత పతనం అయ్యాయి. ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ కంపెనీలను జాతీయం చేయాలని, వాటిని అనంతరం విక్రయించాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి.
Also Read : అదానీ గ్రూప్ కు దెబ్బ మీద దెబ్బ