CJI Chandrachud : సీజేఐ నోట పాకిస్తాన్ కవి ఒబైదుల్లా మాట
జస్టిస్ ఎంఆర్ షా వీడ్కోలు సభలో చంద్రచూడ్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నిత్యం చదువుతారు. ఆపై అద్భుతంగా మాట్లాడతారు కూడా. ఆయన ఇచ్చే తీర్పులు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాయి కూడా. ఆయన కోట్ చేసే కవితలు, వ్యాఖ్యలు, సూక్తులు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
తాజాగా సీజేఐ చంద్రచూడ్ జస్టిస్ ఎంఆర్ షా వీడ్కోలు సభలో పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ కవి ఒబైదుల్లా అలీమ్ ను ఉటంకించారు. ఆంఖ్ సే దుర్ సాహి దిల్ సే కహాన్ జాయేగా, జానే వాలే తు హమీం యాద్ బహుత్ ఆయేగా ( మీరు మా దృష్టికి దూరంగా ఉండవచ్చు. కానీ మా హృదయాల నుండి కాదు. మేము నిన్ను చాలా కోల్పోతున్నామని అర్థం). అంతే కాదు బాల్ డిలాన్ ను కూడా ప్రస్తావించారు సీజేఐ.
ఎంఆర్ షాను జస్టిన్ ధనంజయ వై చంద్రచూడ్ టైగర్ షా అని కొనియాడారు. ఆయన ధైర్యానికి, పోరాట పటిమకు ప్రతీక అని పేర్కొన్నారు. నవంబర్ 9, 2022న జస్టిస్ షా కొలీజియంలోకి ప్రవేశించారు. ఆ రోజున నా స్వంత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగింది. ఆచరణాత్మక జ్ఞానంతో నిండిన కొలీజియంలో ఆయన నాకు ఘనమైన సహ ఉద్యోగి. అద్భుతమైన సలహాలు ఇచ్చారని అని గుర్తు చేసుకున్నారు సీజేఐ.
1998లో గుజరాత్ హైకోర్టులో తాను ఎంఆర్ షాను కలుసుకున్నానని తెలిపారు. ఓ కేసు విషయంలో హాజరు కావాల్సి ఉందని, తాను ముంబైలో గౌను మరిచి పోయానని షా తనకు దానిని ఏర్పాటు చేశారని చెప్పారు సీజేఐ.
