CM Bhagwant Mann: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

CM Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో సీఎం మాన్ ను హుటాహుటీన మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండ్రోజులుగా ఆయన జర్వం, పొత్తకడుపు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు.

CM Bhagwant Mann Hospatalised

కాగా, మాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఆయన సన్నిహత వర్గాలు తెలిపాయి. అయితే మాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎప్పుడు డిశ్చార్చ్ కావచ్చనే విషయంపై సీఎం కార్యాలయం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.

Also Read : Monkeys: చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు

Leave A Reply

Your Email Id will not be published!