CM Chandrababu Naidu: ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
CM Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.
CM Chandrababu Naidu..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్. పార్టీకి మనమంతా వారసులం మాత్రమే… పెత్తందారులం కాదు. నేను కూడా పార్టీకి అధ్యక్షుణ్ని.. టీమ్ లీడర్‌ను మాత్రమే. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీను ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. పార్టీ సంకల్ప బలం కూడా చాల గొప్పది. చరిత్రలో తెదేపా నాటి స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయి. 43 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి… వాటన్నింటినీ అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నాం. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు.
రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు – లోకేశ్
పార్టీలో సంస్కరణలు తనతోనే మొదలు కావాలంటూ… టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న వారు ఆ తర్వాతి స్థాయికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు. నాలుగు సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నానన్నారు. గ్రామస్థాయి నాయకులు రాష్ట్ర నేతలుగా ఎదిగి పొలిట్ బ్యూరోలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. యువతకు రెక్కలు వచ్చి రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తామన్న ఆయన… పని చేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని వెల్లడించారు. పార్టీలో యువరక్తం నింపేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు. తాను ఎక్కడ మాట్లాడుతున్నా రెడ్ బుక్ ప్రస్తావన వస్తోందన్న లోకేశ్… రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తోంది, ఇంకొందరు బాత్రూమ్ ల్లో జారిపడతున్నారని విమర్శించారు. ఇగోలు, అధికార గర్వం పక్కన పెట్టి అంతా కలసికట్టుగా పనిచేద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేశ్ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంతవరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు.అ
తెలుగుదేశం పార్టీ మాకు కన్నతల్లి వంటిది – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో జరిగిన ఈ వేడుకలకు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ‘‘ ఎలాంటి కష్టాలు వచ్చినా తెదేపా ఎదుర్కొని నిలబడింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో కలసికట్టుగా ముందుకెళ్తున్నాం. బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్న పార్టీ టీడీపీ. ఈ పార్టీ మాకు కన్న తల్లి వంటిది. తెలుగు వాళ్లు ఎక్కడున్నా పార్టీ అక్కున చేర్చుకుంటుంది’’ అని అన్నారు. దేశంలో చరిత్రలో నిలిచిపోయేలా కోటి మంది సభ్యత్వాలతో నడుస్తున్నది అంటే దానికి కారణం యువనేత లోకేష్ అని తెలిపారు. టీడీపీ అడ్రస్‌ను సవాల్ చేసిన వ్యక్తులే ప్రస్తుతం చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ రథసారథులని… వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Also Read : MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్