CM Chandrababu Naidu: అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం
అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం
CM Chandrababu Naidu : గత ఐదేళ్ళ వైసీపీ పరిపాలనలో గడ్డు రోజులు ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతి(Captail Amaravathi)… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత మరల పురాతన వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేసి నిర్మాణాలను పున:ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) నిర్ణయించారు. దీనితో ప్రధాని కార్యక్రమం కోసం స్థలం ఎంపికపై సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
CM Chandrababu Naidu Invites
అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మంగళవారం సమావేశమయ్యారు. రాజధాని పనుల పున:ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే ప్రధాని అనుకూల సమయం, అందుబాటులో ఉన్న ముహూర్త సమయాలు తదితర అంశాలపై సీఎం సమావేశమయ్యారు. ప్రధాని కార్యక్రమం కోసం స్థలం ఎంపిక ఇతర అంశాలపైనా సీఎం చర్చించారు. నవనగరాల్లో ఇంకా పనులు ప్రారంభించాల్సినవి ఏంటి, వాటిల్లో ప్రధానితో ఏవి శంకుస్థాపన చేయించాలి అనే అంశాలపై సీఎం నివేదిక తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపటి ఢిల్లీ పర్యటనలో మోదీని కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే రూ.22 కోట్లకు పైగా అమరావతిలో పనులు చేసేందుకు సోమవారం కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా ప్రధాని చేతుల మీదుగానే అమరావతి పనులు పున:ప్రారంభిస్తామని ఇప్పటికే ఓ కార్యక్రమంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముహూర్త సమయాన్ని సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఏ సమయం బాగుంటుందనే దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం సాయంత్రం అమరావతి నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. అనంతరం ఢిల్లీలో ఎన్టీఏ కూటమి ఎంపీలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.రేపు బుధవారం మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంకానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానిస్తారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు.
Also Read : Botsa Satyanarayana: పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స ! ఎందుకంటే ?