CM Chandrababu : వాట్సాప్ గవర్నెన్స్ లో అధికారుల జాప్యంపై సీఎం సీరియస్
వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు...
CM Chandrababu : మంత్రులు, అధికారులతో సమీక్షలో కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu). ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా.. కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అలాంటి వాళ్లు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజల బాధలను ఓపికతో వినాలి. సేవకులం అనే భావనతో పనిచేయాలన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు.
CM Chandrababu Slams
వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలన్నారు. కార్యాలయాలకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని కొన్ని శాఖల అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం ఆదేశించారు.
Also Read : విఐపీల భద్రత కై 9 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొన్న ఏపీ సర్కార్