తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా టీటీడీ చైర్మన్ రాసలీలల వ్యవహరానికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. అవి పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తను ఇతర మహిళలతో చాలా సన్నిహితంగా ఉంటున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అయితే ఆ వీడియోలు తనవి కావని, అంతా ఫేక్ అంటూ పేర్కొన్నారు, ఖండించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
ఈ మొత్తం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ తరుణంలో ఆదివారం కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోలు నిజమైన వీడియోలేనని అన్నారు. తన కామక్రీడల వీడియోలు బయటకు రాగానే డీప్ ఫేక్ అంటున్నాడంటూ బీఆర్ నాయుడుపై భగ్గుమన్నారు. ఆ వీడియోలను ఏఐ సాంకేతికతను ఉపయోగించి తయారు చేశారంటూ ఆరోపించారు కరుణాకర్ రెడ్డి. ఈ వీడియోలకు సంబంధించి తాను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడానని, అవి కరెక్టేనని చెప్పారన్నారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే.. మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.
