CM Chandrababu: వైసీపీ అసత్య ప్రచారన్ని తిప్పి కొట్టాలి సీఎం చంద్రబాబు
వైసీపీ అసత్య ప్రచారన్ని తిప్పి కొట్టాలి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పని అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని మునిగిపోయిందని.. ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు (CM Chandrababu) దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారంపై స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
CM Chandrababu Slams
‘‘రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఊళ్లు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఓ సారి వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైకాపా (YSRCP) యత్నిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజం అనే స్థాయికి తీసుకెళ్తారు. మంచి గురించే కాదు.. చెడు చేసేవారి గురించీ ప్రజలను చైతన్య పరచాలి.
రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని మరింత క్రమశిక్షణతో ఉండాలి. మీ మాట, చర్య ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదు. ఏ ఒక్కరూ వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కోసం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నాం. ఇతర పదవుల భర్తీ కూడా త్వరలోనే చేపడతాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి. పులివెందుల, ఒంటిమిట్టలో విజయానికి కృషి చేసిన నేతలకు అభినందనలు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలి’’ అని చంద్రబాబు అన్నారు.
CM Chandrababu – భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి చంద్రబాబు
రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాల పరిస్థితిపై సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పరిస్థితిని సీఎస్‌కు సీఎంకు వివరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
‘‘ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ముందస్తు సన్నద్ధత, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Also Read : Minister Nara Lokesh: పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
