YS Jagan: వైఎస్ జగన్‌ కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌

వైఎస్ జగన్‌ కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌

YS Jagan : బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సోమవారం ఫోన్‌ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆయన జగన్‌ (YS Jagan) ను కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. ఇవాళో, రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించాలనుకుంటోంది. ఈ క్రమంలో… పోటీ లేకుండా చూడాలని ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అయితే వాళ్ల నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి రాజ్‌నాథ్‌ మద్దతు కోరారు. ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని వైఎస్‌ జగన్‌ బదులిచ్చినట్లు తెలుస్తోంది.

YS Jagan – రామంతాపూర్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ లోని రామంతాపూర్‌ లో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు. ‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

Also Read : CM Chandrababu: వైసీపీ అసత్య ప్రచారన్ని తిప్పి కొట్టాలి సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!