CM Eknath Shinde : నవీ ముంబైలో తిరుపతి బాలాజీ – సీఎం
నెరవేరనున్న మరాఠా వాసుల కల
CM Eknath Shinde : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి మరాఠా భక్తులను ఆశీర్వదించేందుకు నవీ ముంబైకి వచ్చారని అన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(CM Eknath Shinde). తిరుమల ఆలయ తరహాలోనే శ్రీ బాలాజీ ఆలయం నిర్మించడం జరుగుతుందని చెప్పారు. దివ్య కార్యంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముంబైలో శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు.
ఇదిలా ఉండగా నవీ ముంబై లోని ఉల్వేలో మహారాష్ట్ర సర్కార్ కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
అనంతరం సీఎం షిండే ఆలయ విశేషాలను వివరించారు సీఎం. వెంకట రమణ గోవిందా అంటూ మాట్లాడారు. ఇవాళ మహారాష్ట్రకు మరుపురాని రోజు గా అభివర్ణించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం అందరికీ ఉండదని అన్నారు సీఎం. రాబోయే రోజుల్లోనే ఆ దేవ దేవుడిని దర్శించుకునే అదృష్టం ఇక్కడికి వస్తుందన్నారు.
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ వంతెన త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానం చేయబోతున్నట్లు తెలిపారు. ఇదంతా శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో జరుగుతోందన్నారు ఏక్ నాథ్ షిండే.
Also Read : Somu Veerraju : విశాఖ, తిరుపతిలో షా, నడ్డా సభలు