Om Raut Kiss Kriti Sanan : శ్రీ‌వారి సాక్షిగా కృతికి ఓం రౌత్ కిస్

తీసింది దేవుడి సినిమా చేసింది వెకిలి చేష్ట‌లు

Om Raut Kiss Kriti Sanan : ప్ర‌భాస్, కీర్తి స‌న‌న్ న‌టించిన ఆది పురుష్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్(Om Raut) చేసిన ప‌నికి యావ‌త్ భ‌క్తజ‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. తిరుప‌తిలో ప్రీ రిలీజ్ వేడుక నిన్న ముగిసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజ‌ర‌య్యారు. వేడుక ముగిసింది. బుధ‌వారం ఉద‌యం న‌టి కృతి స‌న‌న్ తో పాటు ద‌ర్శ‌కుడు ఓం రౌత్(Om Raut) తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు.

ఇక్క‌డే అప‌శ్రుతి చోటు చేసుకుంది. ఆల‌యం ముందు ద‌ర్శ‌కుడు న‌టి కృతి స‌న‌న్ చెంప‌ల‌పై గ‌ట్టిగా ముద్దు పెట్టాడు. ఆపై ఆలింగ‌నం చేసుకున్నాడు. ఈ స‌మ‌యంలో న‌టి శ‌రీరంపై స్వామి వారికి సంబంధించి ఆల‌య అర్చ‌కులు స‌మ‌ర్పించిన శాలువా కూడా ఉంది. ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రంలో ఇలాంటి గ‌లీజు పనులు ఏమిటి అంటూ స‌భ్య స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. అస‌లు తిరుమ‌లలో టీటీడీ చైర్మ‌న్, ఈవో, స‌భ్యులు, ఆల‌య అర్చ‌కులు ఏం చేస్తున్నారంటూ నిల‌దీస్తున్నారు భ‌క్తులు.

వెంట‌నే స్వామి వారి స‌మ‌క్షంలో ఇలాంటి వెకిలి చేష్ట‌లు, గ‌లీజు ప‌నులు చేయ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. అంతే కాకుండా కృతి స‌న‌న్ కు ముద్దు పెట్టిన ద‌ర్శ‌కుడు ఓం రౌత్ , న‌టి స‌న‌న్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేక పోతే తాము సినిమాను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read : CM Eknath Shinde : న‌వీ ముంబైలో తిరుప‌తి బాలాజీ – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!