హైదరాబాద్ : ఈనెల రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శివ ఆలయలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇందులో భాగంగా మహా శివరాత్రి ఉత్సవాలకు రావాలని కోరారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని. వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయంతో పాటు కీసరగుట్ట మహా శివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు-2026 కోసం ఆహ్వానాలు అందజేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఆలయ కార్య నిర్వహణాధికారి రమాదేవి, ఆలయ అర్చకులు ఉన్నారు, వారు ఆహ్వానాన్ని అందజేసి, మహా ఉత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహా శివరాత్రి జాతర మహోత్సవానికి హాజరు కావాలని అధికారికంగా ఆహ్వానించారు. , మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్స్ కమిషనర్ హరీష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, కీసరగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ , ఆలయ పూజారులతో కలిసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026 కు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఈ చర్యను అభినందించారు . ఉత్సవాలు సజావుగా నిర్వహించడానికి , భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వ మద్దతును ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.