ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీసీ టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భారత్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 161 రన్స్ మాత్రమే చేసింది. ఆశించిన ప్లేయర్లు అంతగా ఆడలేక పోయారు . ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశ పరిచాడు. ప్రత్యేకించి తన పర్ ఫార్మెన్స్ పై ప్రస్తావించాడు. ఇదే సమయంలో భారత్ తరపున కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అద్బుతంగా ఆడాడని, కానీ శర్మ నిరాశ పరిచాడని పేర్కొన్నాడు. అమెరికాపై 29 పరుగుల విజయంతో ప్రారంభించింది. స్టార్ స్పోర్ట్స్ అమూల్ క్రికెట్ లైవ్ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.
గవాస్కర్ తో పాటు పార్థివ్ పటేల్ తిలక్ వర్మ బ్యాటింగ్ ను ప్రశంసించారు. తిలక్ వర్మ చాలా తెలివైన క్రికెటర్. అతను తన బ్యాటింగ్ నైపుణ్యాలు లేదా షాట్ల శ్రేణికి మాత్రమే కాకుండా, వాటిని ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఆడాలో తెలుసు కున్నందుకు కూడా చాలా ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇదే ప్లాన్ ను అమెరికాపై చూపించాడని తెలిపాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే మైదానంలోకి వచ్చాడు వర్మ. దూకుడు పెంచలేదు. కానీ తెలివిగా పరుగులు చేయడం ప్రారంభించాడని పేర్కొన్నారు. రెండో మ్యాచ్ లో తప్పనిసరిగా అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడడం ఖాయమని జోష్యం చెప్పాడు.
