KCR Nikhat Zareen : తెలంగాణ బిడ్డ‌కు స్వ‌ర్ణం కేసీఆర్ సంతోషం

రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచిన నిఖ‌త్ జ‌రీన్

KCR Nikhat Zareen : కామ‌న్వెల్త్ గేమ్స్ 2022లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖ‌త్ జరీన్ చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికే బాక్సింగ్ విభాగంలో ప‌లు ప‌త‌కాల‌ను సాధించిన జ‌రీన్ తాజాగా జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఆపై త‌న కెరీర్ లో మ‌రో ప‌త‌కాన్ని చేర్చింది. బాక్సింగ్ మ‌హిళ‌ల 48 కేజీల మినిమ‌మ్ వెయిట్ విభాగంలో బంగారు ప‌త‌కాన్ని సాధించింది. దేశానికి, రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచింది.

ఐర్లాండ్ బాక్స‌ర్ మెక్ నౌల్ ను 5-0 తేడాతో మ‌ట్టికరిపించింది. చుక్క‌లు చూపించింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ బిడ్డ నిఖ‌త్ జ‌రీన్ బంగారు ప‌త‌కం గెల‌వ‌డం ప‌ట్ల యావ‌త్ భార‌తం సంతోషంతో మునిగి పోయింది.

భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిఖ‌త్ జ‌రీన్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రీన్ కు కంగ్రాట్స్ చెప్పారు. నీ విజ‌యం యావ‌త్ యువ‌త‌కు ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

ఇలాంటి విజ‌యాలు మ‌రిన్ని సాధించాల‌ని ఆకాక్షించారు పీఎం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR Nikhat Zareen)  ప్ర‌శ‌సంల‌తో ముంచెత్తారు నిఖ‌త్ జ‌రీన్ ను. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెకు అన్ని విధాలుగా స‌హాయ సహ‌కారాలు అందించింద‌న్నారు.

కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఎంతో మంది బాక్స‌ర్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డింద‌ని, ఆమె పోరాట ఫ‌లితంగానే బంగారు ప‌త‌కం ద‌క్కింద‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా నిఖ‌త్ జ‌రీన్ కు కంగ్రాట్స్ తెలిపారు. నిఖ‌త్ భార‌త జాతికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు కేసీఆర్. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : శ్రీ‌జ శ‌ర‌త్ జంట‌కు బంగారు ప‌త‌కం

Leave A Reply

Your Email Id will not be published!