తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి కీలక కామెంట్స్ చేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం విధిగా రాష్ట్రానికి సంబంధించి సీఎం విధిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్ తో సీఎం చర్చలు జరపడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
దీనిని గమనించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏకవ్యక్తి పాలన సాగుతోందని ఆరోపించారు గవర్నర్. ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాలుగా తనను సీఎం కేసీఆర్ కలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాష్ట్రం బాగుండాలంటే, పాలన సజావుగా సాగాలంటే సీఎంతో తనతో కలవాలని స్పష్టం చేశారు.
ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా పెండింగ్ బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఒక దానిని తిరస్కరించినట్లు తెలిపారు. మిగిలిన రెండు బిల్లులకు సంబంధించి ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని కోరారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వయో పరిమితి బిల్లును తిరస్కరించారు. దీంతో పాటు మున్సిపల్ రూల్స్ , ప్రైవేట్ వర్సిటీల బిల్లుపై రాష్ట్ర సర్కార్ ను వివరణ ఇవ్వాలని సూచించారు. తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని స్పష్టం చేసింది రాజ్ భవన్.