IRCTC Tirumala Darshan : ‘గోవిందం’ ప్ర‌యాణం భ‌క్తుల‌కు వ‌రం

శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఐఆర్సీటీసీ తీపి క‌బురు

వేస‌వి కాలంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకునే వారికి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఐఆర్సీటీసీ. గోవిందం టూర్ ప్యాకేజీ పేరుతో సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం ఉంటుంది. హైద‌రాబాద్ నుండి తిరుప‌తికి వెళ్ల‌వ‌చ్చు. ఇది 2 రోజుల రాత్రులు 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ రైలు టూర్ ప్యాకేజీ ప్ర‌తి రోజు హైద‌రాబాద్ నుండి అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారికి తిరుమ‌ల స్పెష‌ల్ ఎంట్రీ ద‌ర్శ‌నం ఉచితం. తిరుచానూర్ లో కూడా ప‌ద్మావ‌తి అమ్మ వారిని ద‌ర్శించుకోవ‌చ్చు.

ఐఆర్సీటీసీ తిరుప‌తి ప‌ర్య‌ట‌న మొద‌టి రోజు హైద‌రాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఎక్స్ ప్రెస్ రైలు సాయంత్రం 5.25 గంట‌ల‌కు లింగంప‌ల్లి నుండి బ‌య‌లు దేరుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారు ఉద‌యం 6.10 గంట‌ల‌కు సికింద్రాబాద్ లో , రాత్రి 7.38 గంట‌ల‌కు న‌ల్ల‌గొండ‌లో ఈ రైలు ఎక్కాల్సి ఉంటుంది.

రెండో రోజు ఉద‌యం తిరుప‌తికి చేరుకుంటారు. హోట‌ల్ లో ఫ్రెష్ అప్ అయ్యాక ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్న భోజ‌నం అనంత‌రం ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఉంటుంది.

తిరుచానూర్ లో ప‌ద్మావతి దేవిని ద‌ర్శించుకున్న త‌ర్వాత సాయంత్రం తిరుప‌తి రైల్వే స్టేష‌న్ వ‌ద్ద పర్యాట‌కుల‌ను దింపుతారు. సాయంత్రం 6.25 గంట‌ల‌కు రైలు బ‌య‌లు దేరుతుంది. మూడో రోజు తెల్ల వారుజామున 3.04 గంట‌ల‌కు న‌ల్ల‌గొండ‌లో, 5.35 గంట‌ల‌కు సికింద్రాబాద్ లో , 6.35 గంట‌ల‌కు లింగంప‌ల్లి లో రైలు దిగ‌డంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధ‌ర‌ల ప‌రంగా చూస్తే ట్రిపుల్ , ట్విన్ షేరింగ్ కు రూ. 3,800 , సింగిల్ షేరింగ్ కు రూ. 4,940 , కంఫ‌ర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ , ట్విన్ షేరింగ్ కు రూ. 5,660 , సింగిల్ షేరింగ్ కు రూ. 6,790 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్డ్ ప్యాకేజీ థ‌ర్డ్ ఏసీ రైలు ప్ర‌యాణం , స్టాండ‌ర్డ్ ప్యాకేజీలో స్లీప‌ర్ క్లాస్ రైలు ప్ర‌యాణం , ఏసీ హోట‌ల్ లో వ‌స‌తి , ఏసీ వాహ‌నంలో సైట్ సీయింగ్ , తిరుమ‌ల‌కు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, అల్హాహారం, ప్ర‌యాణ బీమా వ‌ర్తిస్తుంది.

వారంతం లేదా రెండు రోజుల్లో తిరుమ‌ల‌ను సంద‌ర్శించాల‌ని అనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీ ఓ వ‌రం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ఈ గోవిందం ప్యాకేజీ వివ‌రాలు కింది వెబ్ సైట్ https://www.irctctourism.com లో చూడ‌వ‌చ్చు.

Leave A Reply

Your Email Id will not be published!