CM KCR Gaddar : ప్రజా వాగ్గేయ‌కారుడు గ‌ద్ద‌ర్ – కేసీఆర్

తెలంగాణ పాట‌కు ఖ్యాతి తెచ్చిన యోధుడు

CM KCR Gaddar : ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ మ‌ర‌ణంతో ఒక శ‌కం ముగిసింద‌న్నారు సీఎం కేసీఆర్. ఆయ‌న లేర‌న్న వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు. తెలంగాణ పాట‌కు ప్ర‌పంచ ఖ్యాతి తెచ్చిన ప్ర‌జా వాగ్గేయుకారుడ‌ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాల వ్యాప్తి చేశార‌ని గుర్తు చేశారు కేసీఆర్.

CM KCR Gaddar Emotions

ఆయ‌న మృతి తెలంగాణ‌కు, యావ‌త్ దేశానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. తీవ్ర సంతాపం తెలిపారు.
తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని కేసీఆర్(CM KCR) కొనియాడారు. ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశార‌ని , ప్రజల కోసమే బతికాడని అన్నారు కేసీఆర్.

గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు. కవిగా గద్దర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదని, ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్.

Also Read : Ghanta Chakrapani : ఒక శ‌కం ముగిసింది – ఘంటా చ‌క్ర‌పాణి

Leave A Reply

Your Email Id will not be published!