CM KCR : రైతన్నలకు కేసీఆర్ కానుక
పంధ్రాగస్టున కీలక ప్రకటన
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని రైతన్నలకు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ బంగారు తెలంగాణగా మారిందన్నారు. సమృద్దిగా నీళ్లు ఉండడంతో పంటలు అద్భుతంగా పడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కేవలం రైతుల కోసం రైతు బంధు పథకం అమలు చేస్తోందని స్పష్టం చేశారు కేసీఆర్.
CM KCR Announce New Scheme
ఇదిలా ఉండగా తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మరోసారి నిరూపించుకున్నారు సీఎం . ఈ మేరకు ఆసక్తికర ప్రకటన చేశారు. ఒక రకంగా పంటల సాగు కోసం అప్పులు చేసిన రైతులకు తీపి కబురు అందించారు. ఇప్పటికే రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్(CM KCR) ఉన్నట్టుండి పంద్రాగస్టు కానుకగా రూ. 99,999 వరకు ఉన్న రైతుల రుణాలను వెంటనే మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది . దీంతో రైతులపై తనకు ఉన్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చాటి చెప్పారు. యుద్ద ప్రాతిపదికన రూ. 5,809 కోట్లను ఆర్థిక శాఖ ద్వారా బ్యాంకులకు విడుదల చేసింది.
Also Read : Arvind Kejriwal : బడా బాబుల సేవలో మోదీ – కేజ్రీవాల్