CM KCR : అర్చకులకు కేసీఆర్ ఖుష్ కబర్
రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు
CM KCR : ఎన్నికల వేళ హామీల వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న అర్చకులకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. అర్చకులకు సంబంధించి గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు.
అర్చకులకు ప్రభుత్వం గౌరవ వేతనం రూ. 6,000 ఇస్తోంది. తాజాగా రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
CM KCR Good News for Priests
అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం క్రింద గౌరవ వేతనాన్ని రూ. 6000 నుంచి రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి పాలనలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే అందేవని, అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన కేసీఆర్(CM KCR) రూ.2500 గౌరవ వేతనాన్ని రూ, 6,000 పెంచారని అన్నారు. వేతనం పెంపును సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు.
గతంలో 1805 ఆలయాలకు మాత్రమే ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తే దశల వారీగా ఈ పథకాన్ని మరిన్ని ఆలయాలకు వర్తింప చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి రూ.78. 49 కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు.
Also Read : Komatireddy Venkat Reddy : బీసీల కోసం పదవీ త్యాగం