CM KCR Message : సీఎం ఆత్మీయ సందేశం
జనం బలం బలగం ఆయుధం
CM KCR Message : ఓ వైపు కూతురు కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో సీఎం కేసీఆర్ మొదటిసారిగా భావోద్వేగంతో లేఖను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సందేశాన్ని అందజేశారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలే తనకు బలమని, బలగమని స్పష్టం చేశారు సీఎం(CM KCR Message).
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అందుకే భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. రాదనుకున్న తెలంగాణ కల సాకారమైంది. ఆనాడు ఒక్కడినే కానీ ఆచరణలో చేసి చూపించాను. ఇవాళ దేశం కోసం బీఆర్ఎస్ ను స్థాపించాను. 14 ఏళ్లు కాళ్లకు బలపం పెట్టి తిరిగిన. ప్రతి గడప ఎక్కిన. చివరకు సాధించి చూపించా.
ఇదే సమయంలో ఉద్యమ కాలంలో లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు నమోదైనా జంక లేదు. జైళ్ల పాలైనా ఆనాడు ఉద్యమ ఆకాంక్షను విడువలేదు. రేయింబవళ్లు శ్రమించారు. పార్టీని కాపాడారు. గులాబీ సైనికులం తాము ప్రత్యేకమని చాటారని కితాబు ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రజల ఆశీర్వాదం లక్షలాది కార్యకర్తల తోడ్పాటుతో అపూర్వమైన విజయాలు స్వంతం చేసుకున్నాం.
రెండు సార్లు అధికారంలోకి వచ్చామని ఇదంతా మీ కృషి వల్లనే జరిగందన్నారు కేసీఆర్(CM KCR). దేశంలో ఏ పార్టీకి లేనంతగా ఇవాళ 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీగా చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు , ఒడిదుడుకులు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం.
ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో పచ్చగా మారింది. ఎక్కడ చూసినా నీళ్లు. సమృద్దిగా నిధులు. అభివృద్ది పనులతో అలరారుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ కు విజన్ లేదు. బీజేపీకి దారి లేదన్నారు. ఉన్నది ఒక్కటే అది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
Also Read : నేతలు కాదు పార్టీలు ఏకం కావాలి
మీరు చక్కగా దేశం,ధర్మం కోసం ఇలా 12.37వరకు సమయాన్ని వెచ్చించారే అద్భుతః