CM KCR : భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
CM KCR : నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రతో పాటు తెలంగాణను కోలుకోలేకుండా చేశాయి.
ఇప్పటికే మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సీఎం కేసీఆర్ మరో మూడు రోజులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది సర్కార్.
ఈ తరుణంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. పలువురు మంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. సీఎస్ వివరాలు తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ కోరారు సీఎం(CM KCR).
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరాఠాలో కురుస్తున్న భార వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది గోదావరికి. ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది సర్కార్.
ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంత మేరకు తగ్గించాలని సీఎం సూచించారు. భారీ వర్షాల దెబ్బకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్సారెస్సీ వంటి పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో గురించి సీఎం ఆరా తీశారు.
వరదల వల్ల రవాణా, విద్యుత్ , తదితర సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత మంత్రుల్ని ఆదేశించారు కేసీఆర్. కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాల ప్రజలను ఖాళీ చేశామని తెలిపారు సీఎస్.
ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలన్నారు. వరదలు తగ్గగానే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కేసీఆర్.
Also Read : మూడు రోజులు విద్యా సంస్థలు బంద్