CM KCR : బరా బర్ బీఆర్ఎస్ దే సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR : కొత్తగూడెం – తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఎగిరే జెండా గులాబీనేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
CM KCR Comment
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఇన్నేళ్ల కాలంలో దేశాన్ని భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఉమ్మడి ఏపీలో తెలంగాణను పట్టించు కోలేదని , ఎంతో మంది చని పోయేందుకు ఆ పార్టీ చేసిన ఆలస్యమే కారణమంటూ కేసీఆర్(CM KCR ) సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెసోళ్లు మాయ మాటలు చెప్పేందుకు వస్తున్నారని, వారి మటలు వింటే ఇక ఆగమాగమై పోతారంటూ హెచ్చరించారు. ఓటు విలువైనదని, దానిని జాగ్రత్తగా పని చేసే గులాబీ పార్టీకి వేయాలని పిలుపునిచ్చారు.
ఒకనాడు సింగరేణి నష్టాలలో ఉండేదని కానీ ఇవాళ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. 119 సీట్లకు గాను 100 సీట్లు కచ్చితంగా తమకు వస్తాయని మిగతా కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.
ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ దేశానికి ఆదర్శ ప్రాయంగా మారిందని , అభివృద్దిలో మనను మించిన రాష్ట్రం లేనే లేదని స్పష్టం చేశారు. ఆనాడు తాను గనుక పోరాటం చేయక పోయి ఉంటే ఇవాళ తెలంగాణ వచ్చేదా అని ఒక్కసారి ఆలోచించాలని అన్నారు కేసీఆర్.
Also Read : YS Sharmila : తండ్రీ కొడుకులు తెలంగాణ ద్రోహులు