CM KCR : తెలంగాణ ఆద‌ర్శం మోదీ ఆటంకం – కేసీఆర్

ప్ర‌ధాన మంత్రిపై భ‌గ్గుమ‌న్న సీఎం

CM KCR : దేశానికే తెలంగాణ ఆద‌ర్శ ప్రాయంగా మారింద‌ని కానీ ప్ర‌ధాన మంత్రి మోదీ మాత్రం ప్ర‌తి క్ష‌ణం అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం కేసీఆర్(CM KCR).

అన్ని రంగాల‌లో తెలంగాణ ముందంజ‌లో ఉంద‌న్నారు. కొంద‌రు కావాల‌ని చేస్తున్న ఆరోప‌ణ‌ల‌లో వాస్త‌వం లేద‌న్నారు. ఆనాడు రాష్ట్రం రాద‌న్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు.

వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌రోసారి ప్ర‌ధానిని టార్గెట్ చేశారు. పురోగ‌మి దిశ‌గా తెలంగాణ ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఐటీ రంగంలో దేశంలోనే టాప్ లో నిలిచింద‌న్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ‌ను బ‌తికించు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు కేసీఆర్. మ‌న రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగు ప‌డాల‌ని ఆకాంక్షించారు.

కానీ మోదీ మాత్రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేశారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్ప‌డితే భూముల ధ‌ర‌లు ప‌డి పోతాయ‌ని కొంద‌రు స‌న్నాసులు ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు.

కానీ ఇవాళ భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయ‌ని ఆ ఘ‌న‌త త‌న‌దేన‌న్నారు సీఎం. ప‌క్క‌నే ఉన్న క‌న్న‌డ రాష్ట్రంలో కంటే మ‌న తెలంగాణ‌లోనే పొలాల ధ‌ర‌లు ఎక్కువ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఒక వేళ తెలంగాణ ఏర్ప‌డ‌క పోయి ఉండి ఉంటే ఇవాళ వికారాబాద్ జిల్లా అయి ఉండేది కాదు. క‌లెక్ట‌రేట్ , మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చి ఉండేది కాద‌న్నారు.

పొలాలు ప‌చ్చ‌ని కాంతుల‌తో విరాజిల్లుతున్నాయి. ఒక‌నాడు తెలంగాణ బోసి పోయి ఉండేది. నేడు నిండు నీళ్ల‌తో క‌ళ క‌ళ లాడుతోంద‌న్నారు.

Also Read : ఆర్థిక శాఖ ఓకే మ‌రి భ‌ర్తీ మాటేంటి

Leave A Reply

Your Email Id will not be published!