CM KCR Visit : వీర తిలకం విజయం తథ్యం
కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభ
CM KCR Visit : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల ప్రచార వేళ ఎలాగైనా మూడోసారి పవర్ లోకి రావాలని కంకణం కట్టుకున్నారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్. శనివారం ఎప్పటి లాగే ఎన్నికలకు ముందు నామినేషన్ పత్రాలను శనివారం సిద్దిపేట జిల్లా లోని కోనాయిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు ఉన్నారు.
CM KCR Visit Lord Balaji Temple
ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పత్రాలను స్వామి వారి ముందు ఉంచి పూజలు చేశారు. ఈ సారి కూడా తనను గెలిపించేలా చూడాలని కోరారు కేసీఆర్(CM KCR). ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేయనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాలలో బరిలో ఉంటున్నారు.
నవంబర్ 9న నామినేషన్లు దాఖలు చేయనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుండి నేరుగా కోరుట్ల నియోజకవర్గానికి చేరుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్బంగా ఆరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
సీఎం కేసీఆర్ కు వీర తిలకం దిద్దారు జగిత్యాల జడ్జీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Kishan Reddy : బీజేపీ నేతల కాళేశ్వరం సందర్శన