CM KCR Warning : తెలంగాణ‌లో కుల‌..గుల ప‌త్రిక‌లు

నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR Warning : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో కొన్ని కుల పత్రిక‌లు ఉన్నాయి. మ‌రికొన్ని గుల ప‌త్రిక‌లు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.

CM KCR Warning to Media

త‌మ రాష్ట్రం ఇవాళ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. కానీ ఎప్పుడు ప‌డితే అప్పుడు రాష్ట్రానికి, ప్ర‌గ‌తికి, త‌న‌కు , పార్టీకి వ్య‌తిరేకంగా కొన్ని ప‌త్రిక‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అవి ఒక కులానికి కొమ్ము కాస్తూ ముందుకు సాగుతున్నాయి. మ‌రికొన్ని త‌మ అక్క‌సు (గుల‌) తీర్చుకునే ప‌నిలో ప‌డ్డాయి.

ఇలాంటి ప‌త్రిక‌ల‌కు ఒక స్టాండ్ అంటూ లేద‌న్నారు కేసీఆర్(KCR). తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్ర‌గ‌తి, పురోగ‌తి మీద నిత్యం విషం చిమ్ముతూ వ‌స్తున్న ఆ ప‌త్రిక‌లకు, వాటిలో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. పాలు పోసి పాముల‌ను పెంచ‌లేమంటూ పేర్కొన్నారు.

క‌రోనా ప్ర‌భావం, నోట్ల ర‌ద్దు త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం చూపింద‌ని చెప్పారు. అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వ‌లేక పోయామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్.

Also Read : Patnam Mahender Reddy : కేబినెట్ లోకి ‘ప‌ట్నం’ ..?

Leave A Reply

Your Email Id will not be published!