Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తులు 69,909

Tirumala Hundi : సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల ర‌ద్దీతో కిట కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా భ‌క్తులే క‌నిపిస్తున్నారు. గోవిందా గోవిందా, శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని స్మ‌రిస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా శ్రీ‌నివాసుడిని కొలుస్తారు భ‌క్తులు. స్వామి వారిని ద‌ర్శించుకుంటే ధ‌నంతో పాటు ఆరోగ్యం కూడా క‌లుగుతుంద‌ని భావిస్తారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశం న‌లుమూలల నుండి త‌ర‌లి వ‌స్తారు. ఇక విదేశాల నుంచి కూడా భ‌క్తుల తాకిడి నిత్యం ఉంటోంది.

Tirumala Hundi Rs. 4.37cr

నిన్న ఒక్క రోజే శ్రీ‌వారి హుండీ ఆదాయం భారీగా వ‌చ్చింది. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా స్వామి వారి హుండీకి రూ. 4.37 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

శ్రీ‌వారిని 69 వేల 909 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 29 వేల 327 మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. ఇక ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 12 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు.

ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 12 గంట‌ల‌కు పైగా ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

Also Read : CM KCR Warning : తెలంగాణ‌లో కుల‌..గుల ప‌త్రిక‌లు

Leave A Reply

Your Email Id will not be published!