Chiranjeevi Birth Day : జై చిరంజీవ సుఖీభ‌వ

మెగాస్టార్ పుట్టిన రోజు

Chiranjeevi Birth Day : ఏపీలోని మొగ‌ల్తూరుకు చెందిన చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ‌. న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు . ఆయ‌న వ‌య‌సు 67 ఏళ్లు. ఆగ‌స్టు 22, 1955లో పుట్టారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉంటున్నారు. వ‌య‌సు మీద ప‌డినా ఆయ‌న ఇంకా కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి న‌టిస్తున్నారు. ఇటీవ‌లే భోళా శంక‌ర్ చిత్రం విడుద‌లైంది.

Chiranjeevi Birth Day Celebrations

త‌ల్లిదండ్రులు అంజ‌నాదేవి, వెంక‌ట్ రావు. భార్య సురేఖ కొణిదెల‌, త‌మ్ముళ్లు నాగబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్. బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ ప్ర‌ముఖ నిర్మాత‌. కొడుకు రాం చ‌ర‌ణ్ తేజ ప్ర‌ముఖ న‌టుడు. కూతుళ్లు సుస్మిత‌, శ్రీ‌జ‌. కేంద్ర స‌ర్కార్ లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌జా రాజ్యం పేరుతో పార్టీ పెట్టారు. ఆ పార్టీని న‌డ‌ప‌లేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

డ్యాన్సుల‌కు పెట్టింది పేరు చిరంజీవి. 150 కి పైగా చిత్రాల‌లో న‌టించాడు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌లలో ఉన్నాయి. 39 ఏళ్ల సినీ ప్ర‌స్థానం ఆయ‌న‌ది. భారీ ఎత్తున అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు. 2006 సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను ప‌ద్మ భూష‌ణ్ తో స‌త్క‌రించింది కేంద్ర స‌ర్కార్.

ఆంధ్రా విశ్వ విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్ ను అంద‌జేసింది. దేశ వ్యాప్తంగా చిరంజీవి(Chiranjeevi)కి అభిమానులు ఉన్నారు. 3 వేల‌కు పైగా ఫ్యాన్స్ అసోసియేష‌న్లు ఉన్న‌ట్లు ఓ అంచ‌నా. 1978లో పునాదిరాళ్లు సినిమాతో త‌న కెరీర్ ను స్టార్ట్ చేశారు.

1982లో కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన ఘ‌రానా మొగుడు రూ. 10 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న న‌టుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

మెగాస్టార్ ను బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ తో పోల్చింది మీడియా. అత్య‌ధిక ఆదాయ ప‌న్ను చెల్లింపుదారుగా చిరంజీవికి స‌మ్మాన్ పుర‌స్కారం ప్ర‌క‌టించింది. సీఎన్ఎన్, ఐబీఎన్ నిర్వ‌హించిన స‌ర్వేలో టాలీవుడ్ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తించింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌లో ఇముడ లేక ప్ర‌స్తుతం మౌనంగా ఉన్నారు చిరంజీవి.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!