MK Stalin: ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్..!
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్..!
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరిాగా మిగిలిపొతరు అని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సర కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశా పేట్టేరు. అయితే ఆ బడ్జెట్లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జులై 27న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
MK Stalin Comment
సీఎం స్టాలిన్ ట్వీట్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎదురు దాడికి దిగారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని తీసుకున్న ఎంకే స్టాలిన్ నిర్ణయాన్ని అన్నామలై హస్యాస్పందంగా వర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 10 బడ్జెట్లలో ఆరింటిలో తమిళనాడు ప్రస్తావన లేదని ఎత్తి చూపుతూ ఓ ట్వీట్ చేశారు.
Also Read : AP Assembly: మంత్రులనే మాయచేసేలా కొందరు అధికారుల తీరంటూ పవన్ ఫైర్ !