BJP Slams CM : కల్తీ మరణాలను నితీష్ సర్కార్ దాస్తోంది
BJP Slams CM : బీహార్ రాష్ట్రంలో కేవలం కల్తీ మద్యం కారణంగా కనీసం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా ఘట్ బంధన్ సంకీర్ణ సర్కార్ మాత్రం అలాంటిది ఏమీ లేదని కేవలం 39 మంది మాత్రమే మరణించారని చెబుతోంది.
అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంది. దీనిని లైట్ గా తీసుకున్నారు సీఎం(BJP Slams CM). దేశ వ్యాప్తంగా కల్తీ మద్యం మరణాలపై చర్చకు దారి తీసింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ భవన్ కు ర్యాలీ నిర్వహించారు. కల్తీ మద్యం మరణాలను దాస్తోందని ఆరోపించారు.
కనీసం 100 మంది దాకా చని పోయి ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం కావాలని మరణాలను దాస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనకు పూర్తి బాధ్యత సీఎం నితీశ్ కుమార్ దేనని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
శాసనసభ సాక్షిగా సీఎంను నిలదీశాయి విపక్షాలు. అయితే తాము ముందు నుంచీ కల్తీ మద్యాన్ని సేవించ వద్దని చెప్పామని, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశామన్నారు నితీశ్ కుమార్. కానీ వాళ్లు పట్టించు కోలేదన్నారు. అయితే కల్తీ మద్యం తయారీదారులు ఎవరైనా సరే అరెస్ట్ చేయమని ఆదేశించామన్నారు.
కాగా తయారు చేసే పేద వారిని వదిలి వేయమని చెప్పామని తెలిపారు. కాగా తాము చెప్పినా వినిపించు కోకుండా తాగి చని పోయిన వారికి పరిహారం ఇవ్వలేమని సీఎం స్పష్టం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించాయి ప్రతిపక్షాలు. అసలు మద్యం తయారీదారులకు పర్మిషన్ ఇచ్చారని నిలదీశాయి.
Also Read : వ్యవసాయ రంగానికి కేంద్రం ఊతం