CM Revanth Reddy: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణా సర్కార్… రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును మరోమారు పోడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ నెలాఖరు వరకు అంటే.. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్‌కు(LCR) 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాయితీపై ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్నంతమేర స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy Extends

మరో వైపు ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ. 1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు సమాచారం. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 15.27 లక్షలు వచ్చాయి. వాటిలో 15,894 దరఖాస్తులను ప్రభుత్వాధికారులు తిరస్కరించారు. ఇక ప్రాసెస్ అయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 6. 87లక్షలు కాగా… ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ. 8.65 లక్షలు పెండింగ్‌లో ఉంది. వీటితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలు కాగా… వాటికి సంబంధించి ప్రోసీడింగ్ ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 58, 032 ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read : Ratan Tata: దివంగత రతన్ టాటా ఔదార్యం ! సింహభాగం ఆస్తులు దాతృత్వానికే !

Leave A Reply

Your Email Id will not be published!