CM Revanth Reddy : రైతులకు రేవంత్ ఖుష్ కబర్
రైతు భరోసా నిధులు విడుదల
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక నిర్ణయాలకు తెర లేపారు. పాలనా పరంగా సమీక్షలు చేపడుతూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 2 హామీలకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షలు ఆరోగ్య శ్రీ కింద పెంపునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రెండు అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలోని మహిళలు, యువతులంతా రేవంత్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు.
CM Revanth Reddy Good News to Farmers
ఇక రైతులు తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని వెంటనే రైతు భరోసా కింద రుణాలు మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలని, తాము అందించే ఈ సాయం పెట్టుబడికి ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read : Akunuri Murali : జనార్దన్ రెడ్డి శని పోయింది