CM Revanth Reddy: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రి కొండా సురేఖ… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలయ అర్చకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసి ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయ అర్చకులు… సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు పలికారు. అనంతరం రాములవారి తీర్థ ప్రసాదాలను అందజేసి… స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ సహా ఇతర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు.
CM Revanth Reddy – వినూత్నంగా భద్రాద్రి రామయ్య ఉత్సవాలు
ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినం పురష్కరించుకుని తెలంగాణాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 30వ తేదీన శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా 6వ తేదీన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం, 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Minister Kishan Reddy: దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే డీలిమిటేషన్ డ్రామా – కిషన్‌రెడ్డి