CM Revanth Reddy: ఆర్థిక ఇబ్బందులున్నా… ఆరు గ్యారంటీల అమలు చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బందులున్నా... ఆరు గ్యారంటీల అమలు చేస్తాం - సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా… ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేసారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ రెండు గ్యారంటీలను… ఏ హంగు… ఆర్భాటం లేకుండా ప్రారంభిస్తున్నామన్నారు.
CM Revanth Reddy Comment
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి… రూ. 1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను… ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 1,200కి పెంచింది. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని తెలంగాణా ప్రభుత్వం కేవలం రూ. 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ… ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతుంది’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : Mission Gaganyaan: అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వ్యోమగాములు వీరే !