CM Revanth Reddy : ఉచిత బస్సు సబ్సిడీకి రూ. 374 కోట్లు
సీఎం నిర్ణయం ప్రభుత్వం ఆదేశం
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హామీలలో రెండు గ్యారెంటీలను ప్రకటించారు. ఇందులో మహిళలకు ఉచితంగా బస్సు సర్వీస్ కింద మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.
CM Revanth Reddy Comment about Free Bus
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కింద ఇప్పటి వరకు ప్రకటించిన విధంగా రూ. 5 లక్షలకు బదులుగా రూ. 10 లక్షలకు పెంచారు. దీంతో పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున భరోసా ఇచ్చారు.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి తీపి కబురు చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ మేరకు ఉచిత బస్సు ప్రయాణానాకి సంబంధించి గురువారం కీలక ప్రకటన చేశారు. సబ్సిడీ కింద రూ. 374 కోట్లను మంజూరు చేశారు. అంతే కాకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి సంబంధించి రూ. 996 కోట్లు మంజూరు చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి గా కొలువు తీరిన కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వచ్చే ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి అభివృద్ది పనుల కోసం రూ. 75 కోట్లు మంజూరు చేశారు.
Also Read : Yadadri Temple : యాదగిరిగుట్ట కళ కళ