CM Revanth Reddy : టీఎస్పీఎస్సీ పై రేవంత్ సమీక్ష
త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్స్ క్యాలెండర్ ను ప్రకటించింది. పవర్ లోకి రావడంతో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం.
CM Revanth Reddy Discussionon TSPSC
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి రివ్యూ చేశారు. ఇప్పటికే గత కేసీఆర్ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయని నివేదించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కేవలం 85 వేలకు పైగా జాబ్స్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇబ్బందిగా ఉంటుందని వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ చేశారు. తీరా అవి కూడా సరిగా నిర్వహించలేక పోయారు. అంతులేని అవినీతి, అక్రమాలకు తెర తీశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు. దీనిపై సిట్ కు ఆదేశించింది అప్పటి సర్కార్.
దీంతో మొత్తం వ్యవహారంపై ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటి వరకు ప్రకటించిన , నిర్వహించిన పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం. అంత వరకు ఎవరిని చైర్మన్ గా నియమించాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు రేవంత్ రెడ్డి.
Also Read : Nara Lokesh : జాబ్స్ ఇవ్వడంలో జగన్ విఫలం