Kerala Governor : న‌న్ను చంపేందుకు సీఎం కుట్ర

కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ షాకింగ్ కామెంట్స్

Kerala Governor : కేర‌ళ – కేర‌ళ‌లో సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. పిన‌ర‌య్ విజ‌య‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను చంపేందుకు కుట్ర ప‌న్నారంటూ సీఎంపై మండిప‌డ్డారు ఆరిఫ్. తాను ఎయిర్ పోర్టుకు వెళుతుండ‌గా త‌మ పార్టీకి చెందిన ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న తెలిపారని, వీరిని అడ్డం పెట్టుకుని త‌న‌ను అంతమొందించాల‌ని ప్లాన్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు కేర‌ళ రాష్ట్రంలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆరోపించారు .

Kerala Governor Complaints

తాను వెళుతుండ‌గా త‌న‌కు ఉన్న సెక్యూరిటీని కూడా ప‌క్క‌కు తోసి వేశార‌ని, ఇదే స‌మ‌యంలో త‌న కారు అద్దాల‌ను ప‌గుల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ వాపోయారు గ‌వ‌ర్న‌ర్(Kerala Governer). స‌ద‌రు ఆందోళ‌న కారులంతా పోలీసు వాహ‌నాల్లో వ‌చ్చార‌ని తాను ఏమీ చేయ‌లేక పోయానంటూ పేర్కొన్నారు ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్.

ఇలాంటి చ‌వ‌క‌బారు ప్ర‌ద‌ర్శ‌న‌లు తాను ప‌ట్టించు కోనంటూ స్ప‌ష్టం చేశారు. తాను కొత్త‌గా కారు కొనుక్కున్నాన‌ని , ఇది కొనుగోలు చేసి ఆరు నెల‌లు మాత్ర‌మే అయ్యింద‌ని తెలిపారు. అవి కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయ‌ని దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు గ‌వ‌ర్న‌ర్.

చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ కే ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక పోతే ఎలా అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : CM Revanth Reddy : టీఎస్పీఎస్సీ పై రేవంత్ స‌మీక్ష

Leave A Reply

Your Email Id will not be published!