CM Revanth Reddy Comment : రేవంత్ ముద్ర గుండెల్లో ద‌డ‌

ఉన్న‌తాధికారుల‌లో గుబులు

CM Revanth Reddy : బుల్లెట్ కంటే వేగంగా క‌దులుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy). గ‌తంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీసిన ఒక్కడు తీసిన సినిమాను గుర్తుకు తెచ్చేలా చేస్తున్నాడు. వ‌చ్చీ రావ‌డంతోనే తానేమిటో , త‌న స‌త్తా ఏమిటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రేటెంత రెడ్డి అన్నా, బ్లాక్ మెయిల‌ర్ అన్నా ప‌ట్టించు కోలేదు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా కించ ప‌రిచే ప్ర‌య‌త్నం చేసినా డోంట్ కేర్ అన్నాడు. ఆపై జైలు పాలు చేసినా ఊరుకున్నాడు. కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. త‌న పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించాడు. ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే త‌న టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. త‌న వారికి కీల‌క ప‌ద‌వులు ఇప్పించు కోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌స్తుతానికి 11 మంది కేబినెట్ లో కొలువు తీరారు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఉన్న‌తాధికారుల‌ను బ‌దిలీ చేసే ప‌నిలో ప‌డ్డారు. వ‌చ్చీ రావ‌డంతోనే ముందే చెప్పిన‌ట్టుగానే ప్ర‌జా ద‌ర్బార్ కు తెర తీశాడు. వంద‌లాది మంది ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించ‌డం ప్రారంభించారు.

CM Revanth Reddy Comment Viral

రాష్ట్రంలోని పోలీసు శాఖ‌లో ప‌ని చేస్తున్న చాలా మంది గ‌త ప్ర‌భుత్వానికి కార్య‌క‌ర్త‌లుగా ప‌ని చేశార‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌మ‌ను ఇబ్బంది పెట్టిన ఆఫీస‌ర్ల‌ను, పోలీస్ అధికారుల గురించి కామెంట్ చేశాడు. త‌ను ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌క్షాళ‌న ప్రారంభించాడు. ప‌రిపాల‌న ప‌రంగా సీఎంవో కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందిన శేషాద్రికి అప్ప‌గించాడు. ఆపై కీల‌క‌మైన పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా శివ ధ‌ర్ రెడ్డిని నియ‌మించాడు. దీంతో గులాబీ శ్రేణులు, నేత‌ల గుండెల్లో గుబులు రేపుతోంది. త‌ను స‌చివాల‌యానికి చేరుకున్నా త‌న‌ను క‌లిసేందుకు ముందుకు రాని సీనియ‌ర్ ఆఫీస‌ర్ల తీరుపై కూడా గుర్రుగా ఉన్నారు.

ఇక ఇప్ప‌టి దాకా కేసీఆర్(KCR) హ‌యాంలో లూప్ లైన్ లో ఉన్న పోలీస్ ల‌కు త‌ను అంద‌లం ఎక్కించారు. ఐయామ్ కేకే నాట్ ఓకే అన్న పేరు పొందిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డిని ఏరికోరి కీల‌క‌మైన హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా నియ‌మించారు. దీంతో ప్ర‌ధాన పార్టీల‌లో వ‌ణుకు ప్రారంభ‌మైంది.

త‌ను ఎవ‌రికీ లొంగ‌డు. అత్యంత నిజాయితీ క‌లిగిన ఆఫీస‌ర్ గా పేరు పొందారు. గ‌తంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన డ్ర‌గ్స్ కేసుల‌కు సంబంధించి ఫైళ్ల‌ను తీయించారు. ఆ శాఖ‌పై రివ్యూ చేశారు. శాండిల్య‌కు అప్ప‌గించాడు. ఇక డీజీపీగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. సీపీఆర్ఓగా అయోధ్య రెడ్డిని నియ‌మించ‌డం కూడా ఇందులో భాగ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విచిత్రం ఏమిటంటే ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డిన వెంట‌నే కొన్ని శాఖ‌ల్లో ఫైళ్లు మాయం కావ‌డంపై సీరియ‌స్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

ఎవ‌రినీ ఉపేక్షించ వ‌ద్ద‌ని వెంట‌నే దోషులు ఎవ‌రైనా స‌రే ప‌ట్టుకోవాల‌ని, లేదంటే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో ఆయా శాఖ‌ల‌కు సంబంధించి పైళ్లు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి. మ‌రో వైపు విద్యుత్ శాఖ‌లో చోటు చేసుకున్న సంక్షోభంపై ఆరా తీశారు. సీఎండీ రాజీనామాను ఆమోదించ వ‌ద్దంటూ ఆదేశించారు సీఎం. దీంతో అక్ర‌మాల‌కు, అవినీతికి పాల్ప‌డిన ఉన్న‌తాధికారులు, నేత‌ల్లో గుబులు రేగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దూకుడుతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. రాబోయే రోజుల్లో ఎవ‌రు అరెస్ట్ అవుతార‌నేది వేచి చూడాలి.

Also Read : Kamareddy MLA Comment : సైలంట్ కిల్ల‌ర్ టార్చ్ బేర‌ర్

Leave A Reply

Your Email Id will not be published!