CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ ! పార్లమెంట్ అభ్యర్ధుల ఖారారు చేయడానికేనా !

ఢిల్లీకి సీఎం రేవంత్ ! పార్లమెంట్ అభ్యర్ధుల ఖారారు చేయడానికేనా !

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. నేటి సాయంత్రం సీఈసీ మీటింగ్‌ లో రేవంత్ పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. సీఏం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు.

CM Revanth Reddy Delhi Meeting

వరంగల్ నుంచి కడియం కావ్య కి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఖమ్మం టికెట్ కోసం ముగ్గురు మంత్రులు ప్రయత్నాలు సాగించనున్నారు. మంత్రులను పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ లేదా లోకేష్ యాదవ్‌కి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, శేహనాజ్ తుబ్సుం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాలుగు రోజుల క్రితం కూడా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది కానీ నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి మరో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నేడు జరగనున్న మీటింగ్‌లో ఈ నాలుగు స్థానాలపై క్లారిటీ రానుంది.

Also Read : KCR: ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ !

Leave A Reply

Your Email Id will not be published!