CM Revanth Reddy : నళినికి ఉద్యోగం ఇస్తే తప్పేంటి
నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మెదక్ జిల్లాకు చెందిన మాజీ డీఎస్పీ నళినికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదో చెప్పాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ఆదేశించారు.
CM Revanth Reddy Comment
జాబ్ ఇస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటో కూడా ఆలోచించాలని డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని స్పష్టం చేశారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే జాబ్ కు తీసుకోవాలని పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింప జేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు.
Also Read : KCR Discharge : మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్